NLG: దేవరకొండలోని పెద్ద దర్గా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహమ్మద్ అజీమియా, నబీనా, అబ్దుల్ ఖాదర్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని BRS నల్గొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.