NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాపై సోమవారం వివిధ రాజకీయ పార్టీలతో మున్సిపల్ కమిషనర్ వై.సుదర్శన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారిని నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఓటరు జాబితాను సవరించి, తుది జాబితా ఈనెల 10న విడుదల చేస్తామని తెలిపారు.