HYD: నగరంలో ఈ – కామర్స్ ఫుడ్ వేర్‌హౌస్‌లపై ఆహార భద్రత విభాగం భారీగా తనిఖీలు నిర్వహించింది. ప్రముఖ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల గిడ్డంగుల్లో కాలపరిమితి ముగిసిన ఉత్పత్తులు, తప్పుదోవ పట్టించే లేబుళ్లు, పాడైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 75 వేర్‌హౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలతో తనిఖీలు చేశారు. నాణ్యతలో లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.