KMR: లింగంపేటకు చెందిన యాదగిరి పలువురు నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకే ఏడాదిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గతంలో గ్రూప్-4 ఉద్యోగం సాధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే ఇటీవల విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లో జిల్లా ట్రెజరీ శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించి ఆర్డర్ కాపీ అందుకున్నారు.