నాగర్ కర్నూల్: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.