MHBD: జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంపై టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు, రైతులు గంటల తరబడి క్యూల్లో నిలబడినా ఇంధనం దొరకడం లేదని విమర్శించారు.