NZB: బోధన్ పట్టణంలో విద్యుత్ లైన్ల అభివృద్ధి పనుల కారణంగా రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు షర్బతి కెనాల్, సరస్వతి నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, శివాలయం, మార్కెట్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, విశ్వేశ్వరయ్య పార్క్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.