ADB: బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కంపు కొడుతోంది. స్థానిక పాఠశాల,అంగన్వాడి పక్కన చెత్త పడేయడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. చెత్త నుండి పాములు ఇతర కీటకాలు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాద్యాయులు వాపోతున్నారు.అదేవిధంగా అటు వైపుగా వెళ్ళే రోడ్డు గుంతల మయంగా మారింది. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.