NZB: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ నడిపిస్తున్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు.