KMR: మాచారెడ్డి (M) మర్రితండాకు చెందిన అభిమన్యు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను గమనించి చలించిపోయాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్రను కలిసి తన ప్రాజెక్టును వివరించాడు. దీంతో ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.