NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో నామినేషన్లు, బ్యాలెట్ పేపర్ల సిద్ధీకరణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు, వాహనాల సమీకరణ, కౌంటింగ్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.