PDPL: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. TUWJ (IJU) ప్రతినిధులు కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, DEOమాధవికి కృతజ్ఞతలు తెలిపారు.