NLG: చింతపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న గార్లపాటి రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. సిలిండర్ పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.