ADB: అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నేరడిగొండ మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు.