MDCL: మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఓ అమ్మాయికి పరిచయమయ్యాడు. గత 8 నెలలుగా చాటింగ్, వాయిస్ కాల్స్ చేస్తూ గడిపాడు. టెలిగ్రామ్ ఛానల్ ఫోటో అమ్మాయిది ఉండటం, వాయిస్ సైతం అమ్మాయిలా ఉండటంతో నమ్మినట్లు తెలిపారు. 8 నెలల్లో అమ్మాయికి రూ. 42,590 పంపించినట్లుగా తెలిపాడు. చివరికి చూస్తే, అమ్మాయి కాదని తెలియడంతో బోరుమని విలపించాడు.