HYD: నగరంలో మిడ్నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ఐటీ కారిడార్, కూకట్పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్ స్పీడ్తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు ఆకతాయిలు చేసే స్టంట్లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు.