NZB: కోటగిరి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహాతో సందర్శించారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబదించిన రికార్డులను పరిశీలించారు. 22-ఎ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా అప్డేట్ చేయాలని సూచించారు. సాదాబైనామ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆయనతో మండల తహసీల్దార్ గంగాధర్ ఉన్నారు.