NZB: మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సందర్భంగా ఈ నెల 13న మధ్యాహ్నం పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహిస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.