HYD: ఇక పై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం నిర్వహించనున్నట్లు నూతనంగా దేవాదాయ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతు రావు తెలిపారు. ఇది ప్రజావాణి తరహాలో ప్రతి వారం నిర్వహించబడుతుంది. ప్రతి సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ కార్యాలయంలో దరఖాస్తు స్వీకరించనున్నారు. పరిష్కారం అనంతరం దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.