RR: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారిగా పోలింగ్ బూత్లు, ఓటర్ లిస్టులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి సంబంధించి సిద్ధం చేసుకోవాలన్నారు.