KNR: వికసిత భారత్‌లో భాగంగా 2025-26 కేంద్ర బడ్జెట్‌పై ఇవాళ కరీంనగర్లో మేధావుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరీ జయశ్రీ, తదితరులు పురందీశ్వరికి స్వాగతం పలికారు.