MDK: తన తోటలో మద్యం సేవించేవారికి ఒక రైతు వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాడు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సదరు రైతు.. తన మామిడి తోటలో మందుబాబుల ఆగడాలు మితిమీరడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. “ఇక్కడ మద్యం సేవించరాదు.. అతిక్రమిస్తే 25 చెప్పుదెబ్బలు, రూ.5 వేల జరిమానా” అని బోర్డుపై రాశాడు