MNCL: బీసీలకు పూర్తి న్యాయం జరిగే వరకూ ఉద్యమ దారిని వదిలేది లేదని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. ఆదివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ జనాభాకు అనుగుణంగా 52% రిజర్వేషన్ కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. దానికి అనుగుణంగానే ఉద్యమం కొనసాగుతుందని, ప్రస్తుతం 42 శాతం బీసీలకు సరిపోదన్నారు.