KNR: 2027లో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శౌచాలయాలు, తాగునీరు, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. VIP ఘాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ధర్మపురి, కోటిలింగాల వద్ద అవసరమైన మేర పుష్కర ఘాట్లు నిర్మించాలని సూచించారు.