MNCL: చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కొల్లూరి కమలాకర్, ఏఎన్ఎం మాధవి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పలువురు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను వేశారు. తల్లిపాలు చిన్నారులకు వరం లాంటివని పేర్కొన్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు తల్లిపాలను తాగించాలని వారు సూచించారు.