KMM: కల్లూరు మండల స్థాయి సీఎం కప్ పోటీలు ముగిశాయి. 31 గ్రామ పంచాయతీల నుంచి బాలబాలికలు వాలీబాల్, ఖోఖో, పరుగు పందెం, కబడ్డీ, అథ్లెటిక్స్, పలు ఈవెంట్స్‌లలో పాల్గొన్నారు. ఒక్కొక్క టీం నుంచి 12 మంది చొప్పున మొత్తం 112 మంది బాలబాలికలు జిల్లా స్థాయిలో జరిగే క్రీడలకు ఎంపికైనట్లు నిర్వాహకుడు వీర రాఘవులు తెలిపారు.