MNCL: టీఎస్యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆరవ మహాసభలు ఈనెల 28, 29, 30 తేదీల్లో నల్గొండలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజు వేణు అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆ మహాసభల వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. మహాసభలకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.