KNR: కరీంనగర్ ఆటోనగర్ వర్క్‌షాప్ ఓనర్స్ సహకార సంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. 67 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 11 స్థానాలకు పోలింగ్ జరగగా, మహిళా, ఎస్సీ/ఎస్టీ, ఓపెన్ కేటగిరీల నుంచి సభ్యులు గెలుపొందారని ఎన్నికల అధికారి శివ నాగేందర్ తెలిపారు. డిసెంబర్ 11న ఆఫీస్ బేరర్ల ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.