విశాఖ బీచ్ నోవోటల్ హోటల్స్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం బెడ్రూమ్ లో పెట్టిన దీపం వల్ల జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీపం మంచం మీద పడటంతో రూమ్ నుంచి మంటలు చెలరేగాయని ఇంటి యజమానులు చెప్పారన్నారు. గదిలో ఉన్న ఏసీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయని చెప్పారు.