BHPL: గణపురం మండలం మైలారం గ్రామంలో 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఆయుర్వేద అధికారి డా. తనుజారాణి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్యం చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఆయుర్వేదంపై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.