JGL: కరీంనగర్ స్మార్ట్ సిటీ, 24గంటల తాగునీటి పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మంత్రికి ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్‌ను కలిశారు.