GDWL: కేటిదొడ్డి మండలం పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన శాశ్వత అన్నదానానికి రాయచూరుకు చెందిన సురేష్ రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన వారికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.