MBNR: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కపట ప్రేమను చూపిస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో కేవలం 50% మాత్రమే పనులు పూర్తయ్యాయని, కానీ కేసీఆర్ 90% పనులు పూర్తయ్యాయని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అలాగే, ఉదండాపూర్ నిర్వాసితులతో కలిసేందుకు కూడా సమయం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.