SRCL: విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం వరిస్తోందని బ్రహ్మకుమారి సమాజం మానసిక నిపుణుడు సచిన్ పరాగ్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యా ర్థులకు బ్రహ్మకుమారి సమాజం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ‘ఒత్తిడి నియంత్రణపై శనివారం అవగాహన కల్పించారు. సచిన్ పరాగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు.