అదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాదులోని వారి క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ డీసీసీ డా. నరేష్ జాదవ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల గురించి చర్చించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాల గురించి మాట్లాడారు.