HYD: సైబర్ నేర బాధితులకు త్వరిత న్యాయం అందించేందుకు HYD పోలీసుల వినూత్న కార్యక్రమం ‘సీ-మిత్ర’ సత్ఫలితాలిస్తోంది. ప్రారంభమైన పది రోజుల్లోనే 1000 మందికి ఫోన్ కాల్స్ చేసి భరోసా కల్పించారు. ఏఐ సాయంతో 200 ఫిర్యాదు డ్రాఫ్ట్‌లు సిద్ధం చేసి, 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇంటి నుంచే ఫిర్యాదు చేసి, మొబైల్‌కే ఎఫ్ఐఆర్ కాపీ అందుతుండటంతో హర్షం వ్యక్తం చేశారు.