MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం అంబేద్కర్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం సీనియర్ నాయకులు చిప్పరి రాజమల్లయ్య, దుర్గం రాజేష్, నేరెళ్ళ శంకర్ హాజరైన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా కలగూర లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా జుమ్మిడి గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చిప్పకుర్తి ఐలయ్య ఎన్నికయ్యారు.