HYD: జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్పేట్ సర్కిల్, న్యూ బాలాజీనగర్ కాలనీలో 40 గజాల స్థలంపై అక్రమంగా మూడు అంతస్తుల భవనం నిర్మించి సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, మున్సిపల్, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. పాలకులు వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేశారు.