SDPT: జగదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ పి. వేణుగోపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ పథకం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పలు పనులు ప్రారంభించి కులీలకు పని కల్పించాలని, అదేవిధంగా గ్రామాల్లో నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.