MNCL: మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ధరించిన వస్త్ర, వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి పండుగల విశిష్టత పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.