PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి బెల్లంపల్లి సబ్ యూనిట్లో హోంగార్డుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రాజలింగు కుటుంబాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆత్మీయంగా సన్మానించారు. కమిషనరేట్‌లోని ఆయన కార్యాలయంలో రాజలింగుకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. అడిషనల్ DCP అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ACP రాఘవేంద్రరావు ఉన్నారు.