వనపర్తి జిల్లాలోని నల్లచెరువు దగ్గర గంగమ్మ గుడి నిర్మించేందుకు మత్స్యకార సంఘ పెద్దలు సోమవారం ఉదయం సమీక్షించారు. మత్స్యకార సంఘ పెద్దలు కృష్ణ మాట్లాడుతూ.. గంగమ్మ ఆలయానికి అవసరమైన స్థలము ఏర్పాటు చేసి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. గంగమ్మ ఆలయానికి అందరూ సహకరించాలని కోరారు.