NGKL: అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు, సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయ కమిటీ ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, ఆలయ ఈవో చర్యలు చేపడుతున్నారు. అటు వైపు వెళ్లకుండా కర్రలు అడ్డం పెట్టారు. ఈరోజు అన్నదానం నిలిపి వేస్తున్నామని వారు తెలిపారు.