NLG: సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదల కోసం బీఆర్ఎస్ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా చిట్యాల పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, 9వ వార్డు ఇన్ఛార్జ్ ఆగు అశోక్ యాదవ్, అమ్మవారి గుడి మాజీ డైరెక్టర్ జిట్ట శేఖర్ తదితరులు ఉన్నారు.