BDK: కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.