GDWL: రాజోలి మండలంలో 599 మంది చేనేత కార్మికులకు సంబంధించి రూ.3,34,86,500 విలువైన రుణమాఫీ చెక్కును చేనేత జౌళి శాఖ ఏడీవో బాలకృష్ణ మంగళవారం విడుదల చేశారు. ఈ చెక్కును యూనియన్ బ్యాంక్ మేనేజర్ పెద్ది రామయ్యకు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంధ్య శ్రీరామ్ రెడ్డి, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ రుణాలను మాఫీ చేయడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.