BNGR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.