NRML: ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.