KMM: మధిర రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శనివారం రెండో రోజుకు చేరుకుంది. రైల్వే గేటును శాశ్వతంగా మూసి వేయడం వల్ల మధిరలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సిపిఎం నాయకులు బెజవాడ రవి అన్నారు. ప్రత్యాయ్నాయ మార్గం చూపకుండా ఎలా గేటును మూసివేస్తారని ప్రశ్నించారు.