MDK: సీపీఎస్ రద్దు చేయాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు రావుల వెంకటేష్, ఉపాధ్యక్షుడు మధునాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం చేగుంట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సీపీఎస్ రద్దు కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు.